సామాజిక బాధ్యతతో సేవా భవాన్ని అలవర్చుకోవాలి
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో సే వాభావం అలవర్చుకొని పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూ చించారు. శుక్రవారం ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ, విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ రావు, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు శ్రీధర్ చారి, మోహన్ నగర్ నర్సింగ్ రావు, డివిజన్ మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శోభారాణి, స్రవంతి, బల్వంత్, సత్యనారాయణ బాబు, పూస గోరఖ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.






