జీ రామ్‌జీపై కాంగ్రెస్ అక్కసు
- కేంద్రానికి పేరొస్తుందనే.. క్యాబినెట్ దుర్మార్గ నిర్ణయం
- బీజేపీ బలోపేతాన్ని ఓర్వలేకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్, జూలై 3 (విజయ క్రాంతి): వీబీజీ రామ్ జీ పథకాన్ని అమలు చేస్తే కేంద్రానికి మంచి పేరొస్తుందనే అక్కసుతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరగడంతోపాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి జరగబో తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రం లో బీజేపీ ఎదుగుతుండడం ఓర్వలేని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కుమ్మక్కై బిగ్ బాస్ షో మాదిరి డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయ న అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.- సింగరేణి బొగ్గు మాయంపై విచారణ చేసే దమ్ము లేదా? అని నిలదీశారు.-
శుక్రవారం నగరంలోని 37వ డివిజన్లో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ కేఏపీపీ చంద్రతో కలిసి కేంద్రమంత్రి రూ. 77 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. షాషామహల్ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వీబీజీ రాంజీ పథకం అ మలు రాష్ట్రానికి భారం అనిపిస్తే ప్రధానమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లాలే తప్ప కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ స్కూ ళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ పాస్ట్ సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలో ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్, బీఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ జరగడమే కారణమన్నారు.
రూ.1000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి
వారం రోజుల్లో రూ.50 కోట్ల యూడీఎఫ్ నిధులతో కరీంనగర్‌లో రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించబోతున్నామన్నారు. మరో 3 నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం ఇచ్చిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దే పనుల ను ప్రారంభించబోతున్నామన్నారు. కరీంనగర్‌లో పార్కింగ్ సమస్య లేకుండా 25 కోట్లతో శాశ్వత పరిష్కార పనులకు శ్రీకారం చెప్తామని తెలిపారు.
ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.22 వేల కోట్లు తీసుకువచ్చానని తెలిపారు. రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దసరా నాటికి కరీంనగర్ వరంగల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
అతిత్వరలో కరీంనగర్-జగిత్యాల హైవే పనులను ప్రారంభిస్తామని, గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన గన్నేరువరం బ్రిడ్జి నిర్మాణ పనులకు సైతం శ్రీకారం పుట్టబోతున్నామని తెలిపారు. కరీంనగర్‌లో డంపింగ్ యార్డ్ ఇబ్బందులను తొలగించబోతున్నామని, డంపిం గ్ యార్డ్ వద్ద చెత్త నిల్వ లేకుండా చేయబోతు న్నా మన్నారు. హుజూరాబాద్‌లోనూ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు ఇ బ్బంది లేకుండా దూరంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.






