22-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్ ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి సమయంలోజరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రైలును ఎక్కే క్రమంలో కాలు జారి రైలు కిం దపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్. సమాచారం అందగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నంబర్ 90/2026గా నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.
ఆర్‌హెచ్‌సీ 583 విచారణ చేపట్టారు. వివరాల ప్రకారం మృతు డు సికింద్రాబాద్ నుంచి ఒంగోలు వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చి, సింహపురి ఎక్స్‌ప్రెస్ అనుకుని 12721 ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే సమయంలో కాలు జారి రైలు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృ తుడు నూకతోటి నాగరాజు (44), (తం డ్రి: గంగయ్య), ఓ పత్రికలో విలేకరి, నివాసం అర్బన్ కాలనీ, కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. జిఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.