calender_icon.png 22 February, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆలయాల నిర్మాణానికి భూమి పూజ

22-02-2026 12:00:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్లోని శ్రీ సాయి బాబా ఆలయ ప్రాంగణం లో నూతన ఆలయాల నిర్మాణానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గంగ పుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీకృ ష్ణుని గుడి నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడు తూ.. సమాజంలో భక్తి, సంప్రదాయం, సం స్కృతులను కాపాడటంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  గంగ పుత్ర సం ఘం చేపట్టిన ఈ పవిత్ర కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆయ న ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగరాజు, భూతం సత్యనారాయణ, బాలకృష్ణ, గణేష్, సత్యనారాయ ణ, రఘు, బాబు రావు, లడ్డు, సంజోళ్ల అనిత, ప్రీతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.