24 June, 2026 | 1:27 AM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

24-06-2026 12:25 AM

కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ 

కోరుట్ల రూరల్, జూన్ 23 (విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎంపీడీవో ఓదెల రామకృష్ణ అన్నారు. మంగళవారం కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలోఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశఓ లో ఎంపీడీవో వోదెల రామకృష్ణ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే-డ్రైడే‘ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించ లని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టాదానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.అదేవిధంగా, పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, అర్హులైన చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

డయేరియా నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మరియు జింక్ మాత్రల పంపిణీ, సురక్షిత తాగునీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు. గ్రామస్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ సమీనా తబస్సుమ్, హెల్త్ సూపర్వైజర్లు ధనుంజయ్, భూషణ్, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.