వివాహితపై కత్తితో దాడి,కేసు నమోదు
నేరేడుచర్ల,జూన్ 23(విజయ క్రాంతి ): మండల కేంద్రంలో వివాహిత మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. నేరేడుచర్ల ఎస్త్స్ర సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్లకు చెందిన తాళ్ల కాశమ్మ భర్త కోటేశ్వరరావు, వయసు: 55 సం,,లు అను ఆమెకు నేరేడుచర్లకు చెందిన షేక్ సుభాన్ అను అతనితో పరిచయం ఏర్పడగా వారిద్దరూ కలిసి మిర్యాలగూడలో కిరాయి కి రూం తీసుకోని ఇద్దరు కలిసి ఉంటున్నారు,
అయితే కాశమ్మ ఆరోగ్యం బాలేనందున గత 2 నెలల నుండి సుభాన్ నుండి వచ్చి నేరేడుచర్ల లోని తను దత్తత తీసుకున్న కొడుకుతో కలిసి తన ఇంట్లో ఉంటుంది. కాశమ్మ తన వద్దకు రావడం లేదని షేక్ సుభాన్ మంగళవారం ఉదయం అందజా 11.30 గం,,ల సమయంలో కాశమ్మ ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో, కూరగాయలు కోసే కత్తితో కాశమ్మ కడుపుపై మూడు సార్లు పొడువగా రక్త స్రావం అయినదని, కాశమ్మను చికిత్స కొరకు మిర్యాలగూడ లోని ఏరియా ఆసుపత్రికి తరలించగా,ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపరడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేసినారన్నారు.దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.






