అప్రమత్తంగా ఉండాలి
- వర్షాకాలం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- ప్రాజెక్ట్‌ల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి
- అనుమతి లేకుండా ఇంజినీర్లు ప్రాజెక్ట్‌లు వదిలి వస్తే కఠిన చర్యలు
- జూన్ 9న వర్షం సమయంలో అధికారులు సరిగా పని చేయలేదు
- అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా
- సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంచేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధి కారులకు దిశానిర్దేశంచేశారు. వర్షాల నేపథ్యం లో ప్రాజెక్ట్‌ల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్‌ల మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలన్నారు.
ప్రాజెక్ట్ సంబంధిత ఇంజినీర్లు కచ్చితంగా మాన్యువల్‌ను అమలుచేయాలని, ప్రాజెక్ట్‌ల సీఈలు, ఎస్‌సీలు ఈ సీజన్‌లో స్థానికంగా ఉండాల్సిందేనని ఆదేశించారు. ఉన్నతాధి కారుల అనుమతి లేకుండా ఇంజినీర్లు ప్రాజెక్ట్‌లు వదిలి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదలచేస్తామని ప్రకటించారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, ఆర్‌డబ్ల్యూఎస్ అధి కారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రైతు వేది కలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలన్నారు. యూరియా పంపిణీ బాధ్య తను స్థానిక అగ్రికల్చర్ అధికారికి అప్పగించాలని, ఇందులో రెవెన్యూ సిబ్బందిని భాగస్వా మ్యం చేయాలని చెప్పారు. ఈనెల 1న రివ్యూ పెట్టి వర్షాలపై ముందస్తు సూచనలు ఇచ్చానని, ఈనెల 9న వర్షం సమయంలో అధికారులు సరిగా పని చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షం సమయంలో క్యూర్ ఏరియాలో మునిసిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదని మండిపడ్డారు.
వర్షం వచ్చినప్పుడు వాట ర్ లాకింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పూర్తిస్థా యిలో సన్నద్ధం కావాలని, ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోలని సూచించా రు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు రోడ్లపై ఉండాల్సిందేనని, అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని వెల్లడించారు. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని, మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే సహించబోమని హెచ్చరించారు. ట్రాఫిక్ డిపార్ట్‌మెం ట్‌లో తక్షణమే ఖాళీలు పూర్తిచేయాలని ఆదేశించారు.
సమీక్షలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కా జిగిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్‌రెడ్డి, సుమతి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు.






