సోలిపురం ప్రతాపరెడ్డికి డాక్టరేట్ ప్రదానం
ప్రతిభ ప్రయాణంలో వెన్నంటి నడిచిన నా కుటుంబం ఉపాధ్యాయులకు అంకితం
చేవెళ్ల మే 18(విజయక్రాంతి): కందువాడ గ్రామ వాసికి విద్యారంగంలో గౌరవ డాక్టరేట్ మండల పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన బాలాపూర్ చైతన్య విద్య సంస్థల డైరెక్టర్ సోలిపురం ప్రతాపరెడ్డి ఆదివారం భారతీయ విద్యాభవన్ చెన్నైలో జరిగిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. విద్యారంగంలో ఎందరికో ఉచిత విద్యను అందిస్తూ అంకితభావంతో చేస్తున్న సేవలకు గుర్తింపుగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అమృతవల్లి, ఫౌండర్ వెంకటేశష్, నరసింహ గౌడ్, రష్యా రాయబారి, థాయిలాండ్ రాయబారి, చెన్నై పోలీస్ కమిషనర్, శ్రీలంక రాయబారి వాళ్ళ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ... 18 సంవత్సరముల నుండి విద్యారంగంలో ఉంటూ అనేకమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ విద్యార్థులను సామాజిక సేవ వైపు నడిపిస్తూ ఉన్నత చదువులకు పేదవారికి ఆర్థిక సహాయపడుతున్నందుకు ఒక గౌరవంగా గుర్తింపుగా భావిస్తూ ఈ అవార్డు నా వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా నా ప్రయాణంలో తోడ్పడిన నా కుటుంబ సభ్యులకు నాతో పని చేస్తున్న ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నానని అన్నారు. యూనివర్సిటీ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.






