పెద్ది స్వప్న రెడ్డిని పరామర్శించిన తాటి వెంకటేశ్వర్లు
28-07-2026 06:10 PM
దమ్మపేట,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన సతీమణి పెద్ది స్వప్న రెడ్డి ను బూర్గంపహాడ్, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్ది స్వప్న రెడ్డితో మాట్లాడి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ఆమెకు మనోధైర్యం కల్పించారు. భగవంతుని కృపతో పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో మునుపటిలాగే చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.






