28 July, 2026 | 6:52 PM

పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు

28-07-2026 06:17 PM

* నిండుకుండలా ఆనకట్ట

* హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

పాపన్నపేట: వనదుర్గా(ఘనపురం ఆనకట్ట) ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువన నుంచి వరద వస్తుండడంతో 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగి పొర్లుతుంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయల మీదుగా కిందికి ప్రవహిస్తుంది. ప్రాజెక్టు నిండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పొంగిపొర్లుతుండడంతో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు.