20 May, 2026 | 1:35 AM

వడదెబ్బతో ఒకరు.. కోనేరులో పడి ఇంకొకరు మృతి

20-05-2026 12:19 AM

భైంసా, మే 19 (విజయక్రాంతి) : బైసా పట్టణం చెందిన లక్ష్మీబాయి (65) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణంలో కూరగాయల వ్యాపా రం చేసే లక్ష్మి  నాలుగు రోజులుగా ఎండల కారణంగా అస్వస్థకు గురైంది. సోమవారం రాత్రి ఇంటికి చేరుకోగానే వాంతులు చేసుకొని తీవ్ర జ్వరంతో మృతి చెందినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. అలాగే పట్టాలని చెందిన పట్టణానికి చెందిన రాహుల్ గౌడ్ ( 14) దిల్వార్పూర్ మండలం ఎల్లమ్మ ఆలయంలో దర్శనానికి వచ్చి కోనేరులో స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.