7 August, 2026 | 8:19 PM

అథ్లెటిక్స్ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు

07-08-2026 07:06 PM

అభినందించిన నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎంపికైనట్లు విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు.  జావలిన్ త్రో డే సందర్భంగా జిల్లాలోని ఎన్టిపిసిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన  ఆదిత్య,  పథకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. జిల్లాస్థాయిలో హర్షవర్ధన్ పథకం సాధించారన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ  కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచే   క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేటి నుంచి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆదిత్య పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు.