7 August, 2026 | 8:19 PM

11వ వార్డు అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు

07-08-2026 06:58 PM

హుస్నాబాద్: పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్-6 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ... తొలి ఆరు నెలలు తల్లిపాలే శిశువుకు ఉత్తమ ఆహారమని, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు అందించాలని సూచించారు. అనంతరం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించి, అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.