అడెల్లి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
07-08-2026 06:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అతి ప్రాచీన దేవాలయమైన అడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలమడుగు పాక్స్ చైర్మన్ ఎల్మా శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్, కార్తీక్ రెడ్డి, గంగారెడ్డి, మాజీ అడెల్లి చైర్మన్ లష్మినారాయణ తదితరులు ఉన్నారు.






