20 May, 2026 | 2:45 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

20-05-2026 12:20 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

దేవరకద్ర,మే 19 : అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం దేవరకద్ర మండలం నాగారం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో నీటి వసతి నీడ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్ని బస్తాల కొరత లేకుండా తగినన్ని బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని, అధిక సంఖ్యలో హమాలీలను నియమించుకొని, తగినన్ని రవాణా వాహనాలను ఏర్పాటుచేసుకుని నింపిఉన్న ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని కోడూర్ జననీ ఆగ్రోటెక్ బాయిల్ రైస్ మిల్లును సందర్శించి తనిఖీ చేశారు.

రైస్ మిల్లులో అధిక సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకొని లారీలను వెంటనే అన్ లోడింగ్ చేయాలని అన్నారు. ధాన్యం రవాణాకు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తరుగు కటింగ్ చేయకుండా రైతులకు వెంటనే చెల్లింపులు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె . ఎల్.బి హరిప్రియ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.