7 August, 2026 | 8:20 PM

తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ

07-08-2026 06:56 PM

నంగునూరు,(విజయక్రాంతి): నవజాత శిశువుకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారమని బహుళ ప్రయోజన ఆరోగ్య సహాయకులు (ఎంపీహెచ్ఏ) సరస్వతి అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం ద్వారా శిశువుకు మొదటి టీకా అందినట్లవుతుందని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో కీలకమని  సర్పంచ్ సంగు పురేందర్ అన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలుకల తిరుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనితా రెడ్డి, వార్డు సభ్యులు రాజు, డాకూరి రాజిరెడ్డి, ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ కార్యకర్తలు, కత్తుల భవాని, కాచగోని లావణ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.