7 August, 2026 | 8:20 PM

వైద్య కళాశాల హాస్టల్ పనులు వేగవంతం చేయాలి

07-08-2026 07:04 PM

ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): వైద్య కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాస్టల్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పనుల పురోగతిని సమీక్షించారు.

వర్షాల కారణంగా ఆటంకం లేకుండా అంతర్గత పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బాలుర వసతి గృహాన్ని సెప్టెంబర్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. హాస్టల్‌కు అవసరమైన విద్యుత్ సదుపాయాలపై నివేదిక సమర్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు.