7 August, 2026 | 7:58 PM

స్పందించి మొరం వేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు

07-08-2026 06:54 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని ఖమ్మం పల్లి గ్రామంలో చినుకు పడితే చిత్తడే.. ఖమ్మం పల్లి కల్వర్టు బురదమయం.. అనే వార్త జులై 27న విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితమైన విషయం అందరికి తెలిసిందే. వార్త  ప్రచురితమైన నాటి నుంచి శుక్రవారం వరకు ఆ  కల్వర్టు వైపు వరకు వైపు వాహన దారులు వెళ్లి ఇబ్బందులు పడకుండా భారీ వాహనాలను నిలిపి అడ్డుకట్ట  వేశారు. 

కాగా విజయక్రాంతిలో వచ్చిన వార్తకు  స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం కల్వర్టు వద్ద మొరం వేసి సమస్యను పరిష్కరించారు. కల్వర్టు వద్ద బురద మయం అవడంతో తమ ఇబ్బందులను తొలగించిన గ్రామ సర్పంచ్ ప్రభుదాస్, అధికారులు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.