11 June, 2026 | 2:33 AM

ఉత్తమ రైతులకు ఘన సన్మానం

11-06-2026 12:21 AM

మానకొండూరు, జూన్ 10 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్, గ్రామంలో బేయర్, బయోసెన్స్, ప్రైవేట్ లిమిటెడ్ వారి, హైబ్రిడ్ 716 వరి వంగడంలో, అత్యధిక దిగుబడి సాధించిన సిపెల్లి వేణుగోపాల చారి, బండి గట్టయ్య, లను, బేయర్ కంపెనీ సూపర్వైజర్, తోకల నరసింహారెడ్డి, ఆర్గనైజర్ కూరాకుల పోశాలు ఆధ్వర్యంలో, బుధవారం మానకొండూరు మాజీ వైస్ ఎంపీపీ, గోపి మధుసూదన్ రెడ్డి, పచ్చునూరు గ్రామ సర్పంచ్ పార్నంది కేశవ్, ఘనంగా సన్మానించారు,

ఈ సందర్భంగా సూపర్వైజర్ తోకల నరసింహారెడ్డి మాట్లాడుతూ, పచ్చునూరు గ్రామంలో, 120 ఎకరాలకు పైగా 716 రకం హైబ్రిడ్ వరి వంగడం ఇచ్చామని, 100 మంది రైతులకు పైగా 10 నుంచి 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని సిపెల్లి వేణుగోపాల చారి, బండి గట్టయ్యలకు, 14 నుండి 15 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి వచ్చిందని, తెలియజేశారు,ఈ సందర్భంగా రైతు సిపెల్లి వేణుగోపాల చారి, మాట్లాడుతూ, తనకు ఉన్న రెండెకరాలలో, బేయర్ సీడ్ మేల్ ఫిమేల్, వరి సాగు చేశానని, కంపెనీ వారు చెప్పిన విధంగా, సాగు పనులు చేశామని, కష్టానికి ఫలితంగా, అధిక దిగుబడి ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు రావడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సందర్భంగా రైతు ఆనందం వ్యక్తం చేశారు,

మరో రైతు బండి గట్టయ్య మాట్లాడుతూ, ఎకరాకు రెండు లక్షల దాటడం, చేసిన కష్టానికి ఫలితం దక్కింది అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్నంది కేశవ్ , మాజీ వైస్ ఎంపీపీ గోపుమధుసూదన్ రెడ్డి, రైతులు శ్రద్ధతో, కష్టపడి, అధిక దిగుబడి సాధించి, గ్రామ ఆదర్శ రైతులగా నిలవడం సంతోషకరమైన విషయమని రైతుల కృషి ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, వార్డు సభ్యులు, పిట్టల మల్లేశం,కల్వల రవి, పూసాల సతీష్, బేయర్ సూపర్వైజర్, తోకల నరసింహారెడ్డి, ఆర్గనైజర్ కూరాకుల పోషాలు, రైతులు గోపు రాంరెడ్డి,, కోమల్ల మదనయ్య గోపు మహిపాల్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.