25 August, 2026 | 2:04 AM

కూలుతున్నా పట్టింపేది?

25-08-2026 12:00 AM
  1. అక్రమ నిర్మాణాలపై చీమకుట్టని అధికారులు 
  2. న్యూ బోయిన్‌పల్లి  జయనగర్ కాలనీలో స్థానికుల నిరసన
  3. కంటోన్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్

సికింద్రాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కంటోన్మెంట్ అధికారుల అండదండలు ఉన్నాయనో, లేదా వారి ఉదాసీనతో తెలియదు కానీ కంటోన్మెంట్ నియోజకవర్గ బో ర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలు మూడు కాయలు, ఆరు పువ్వులుగా విరాజిల్లుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని న్యూ బోయిన్పల్లి, జయనగర్ కాలనీలో అక్రమ షెడ్ నిర్మాణాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

కాలనీలోని ప్లాట్ నంబర్ 67లో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒ క అక్రమ షెడ్ నిర్మిస్తుండటంపై స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణంలో కంటోన్మెంట్ చట్టాల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని ఈ నిర్మాణం వల్ల కాలనీలో రాకపోకలకు ఇబ్బందుల తోపాటు భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు, పారిశుధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 

కంటోన్మెంట్ యాక్ట్ 2006 నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కంటోన్మెంట్ పరిధిలో ఏ విధమైన శాశ్వత లేదా అశాశ్వత (షెడ్లు వంటివి) నిర్మాణం చేపట్టాలన్నా బోర్డు యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. 

కంటోన్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం అమలు కావలసిన విధివిధానాలు

సెక్షన్ 234, 235 (అక్రమ నిర్మాణాల నిరోధము): బోర్డు అనుమతి లేకుండా చేపట్టిన ఏ నిర్మాణాన్ని అయినా అక్రమ నిర్మా ణంగా పరిగణించి, దానికి వెంటనే ‘స్టాప్ వ ర్క్‘ (పని నిలిపివేత) నోటీసు జారీ చేయాలి. 

సెక్షన్ 248 (కూల్చివేత నోటీసు): అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తికి నోటీసు ఇచ్చి, నిర్ణీత గడువులోగా సదరు నిర్మాణాన్ని తొలగి ంచాల్సిందిగా ఆదేశించాలి. స్పందించని పక్షంలో బోర్డు అధికారులు స్వయంగా కూల్చివేతలు చేపట్టి, ఆ ఖర్చును సంబంధిత యజమాని నుంచే వసూలు చేసే అధికారం కంటోన్మెంట్ యాక్ట్కు ఉంది.

సెక్షన్ 247 (పరిశీలనాధికారం): అక్రమ నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని కంటోన్మె ంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తని ఖీ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చు.

బోర్డు అధికారుల తక్షణ జోక్యానికి డిమాండ్:

జయ నగర్ కాలనీ ప్లాట్ నంబర్ 67 వద్ద జరుగుతున్న ఈ అక్రమ షెడ్ నిర్మాణంపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి, ఈ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కంటోన్మెంట్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 

బోర్డ్ ఉన్నతాధికారి వివరణ...  

కంటోన్మెంట్ బోర్డ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి ఉమాశంకర్ ఫోన్లో మాట్లాడి సంప్రదిస్తే ఆయన ఇంజనీర్ దినేష్ సంప్రదించాలని సూచించారు. వెంటనే ఒకటవ వార్డ్ ఇంజనీర్ కి ఫోన్లో చేసి మాట్లాడడానికి సంప్రదిస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు..