25 August, 2026 | 2:25 AM

జాబ్ నోటిఫికేషన్లు నిల్ లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్

25-08-2026 01:28 AM
  1.    121 మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్లు 
  2. ఆగమేఘాల మీద విడుదల
  3. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ
  4. మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి) : తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేష న్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. 121 రకాల మద్యం బ్రాండ్స్‌కు నోటిఫికేషన్ ఇవ్వడంపై సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుం టే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమే షాలు లెక్కిస్తోందని విమర్శించారు.

కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని, యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు, మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా? అని మండిపడ్డారు. యువత డిగ్రీలు, పిజీలు పూర్తిచేసి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మద్యం షాపులు పెంచి, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలుచేయాలని చూస్తోందని ఆరోపించారు.

సమయానికి యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చేతగాని సర్కారు.. మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నదని విమర్శించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ మోసం, రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయింది, మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయింది, రేవంత్ పగ.. యువత దగ అన్నట్లుగా తయారైందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు చెప్పిన ప్రజా పాలన? అని హరీష్ రావు ప్రశ్నించారు.