రూ.1.69 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల, ఆగస్టు 24: గుమ్మడిదల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
సోమవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లిలో న్యూల్యాండ్ పరిశ్రమ సహకారంతో 86 లక్షల 50 వేల రూపాయలతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, వీరన్న గూడెంలో 15 లక్షల సిఆర్‌ఆర్ నిధులతో అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు, గుమ్మడిదల లో హానర్ ల్యాబ్స్, మైత్రి పరిశ్రమల సౌజన్యంతో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, యూజీడీల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.. అనంతరం నాగిరెడ్డిగూడెం గ్రామంలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో 22 లక్షల రూపాయలగో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గుమ్మడిదల ప్రాంత అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు, పారిశ్రామిక సంస్థలు సామాజిక బాధ్యతతో భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు,వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






