పొద్దంతా రెక్కీ... రాత్రి చోరీలు..!
- వరుస దొంగతనాలతో జనం బెంబేలు
- తాళం వేసిన ఇళ్లే టార్గెట్
- గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలు
- వేలిముద్రలు సేకరిస్తున్న పోలీసులు
గంభీరావుపేట, ఆగస్టు 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలంలో వరుస చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు ప గటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో చో రీలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో సీసీ కె మెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
గంభీరావుపేట చోరీ కలకలం
గంభీరావుపేట మండల కేంద్రంలో గత జూలై 27న బీజేపీ నాయకుడు పత్తి స్వామి ఇంట్లో జరిగిన చోరీ కలకలం రేపింది. గాంధీ చౌక్ కు అతి సమీపంలో ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలోని సుమారు 8 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో దుప్పటి కప్పుకుని వచ్చిన వ్యక్తి దృశ్యాలు నమోదవగా, పోలీసులు వా టి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కోళ్ల మద్దిలో ముడిళ్లలో..
ఈ నేల ఆగస్టు20న కోళ్లమద్ది గ్రామంలో తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. మంజుల, దీప,రాజు ఇళ్లలో తాళాలు పగలగొట్టి సుమారు 3 తులాల బంగారం, 21 తులాల వెండి, రూ.8 వేల నగదు దోచుకెళ్లారు. ఘటన స్థలంలో పోలీసులు వేలి ముద్రలు సేకరించినప్పటికీ నిందితుల ఆ చూకీ ఇంకా తెలియరాలేదు.
గంభీరావుపేట, నర్మాల, దమ్మన్నపేట, లింగన్నపేట ప్రాం తాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లేందుకు భయపడుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలపై నిర్లక్ష్యం కారణంగానే దొం గలు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు.
గ్రామపంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక చొరవ తీసుకొని పాత కెమెరాలను మరమ్మతు చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.






