25 August, 2026 | 4:42 AM

విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలి

25-08-2026 02:02 AM

విద్యార్థి  మృతి పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి

కేవీపీయస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు 

నారాయణఖేడ్, ఆగస్టు 24: నారాయణఖేడ్ జూకల్ శివారులో కొనసాగుతున్న శంకరంపేట్ మాహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్లో మనూరు మండలం బెల్లాపూర్ గ్రామానికి చెందిన  ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి అభిలాష్(9) జ్వరంతో చనిపోవడం పట్ల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందని, విద్యార్థి మరణానికి సమగ్ర విచారణ జరిపించి హాస్టల్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు సోమవారం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అనేకసార్లు హాస్టల్లో ఇలాంటి ఘటనలు జరిగిన ప్రభుత్వం అధికారులు చర్యలు సక్రమంగా తీసుకోక పోవడం వలన ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని అన్నారు. విద్యార్థులకు పెట్టవలసిన భోజనాలు సదుపాయాలు సరిగా కల్పించకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. హాస్టలను పరిరక్షణలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలం చెందారని వెంటనే విచారణ చేపట్టాలని విద్యార్థులకు ఇప్పటికైనా సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థికి మృతికి కెవిపియస్ సంఘం సంతాపం ప్రకటిస్తూ వెంటనే ఈ మృతికి కారణమైన హాస్టల్ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని మరియు విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారులు హాస్టలను సందర్శించక పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

సబ్ కలెక్టర్ ఇక్కడ ఉన్న ఒకే హాస్టల్ ను సందర్శించడం కాకుండా అన్ని హాస్టల్లో సందర్శించి ఉంటే ఇలాంటి ఘటనలు జరగకపోయేమో నాని అన్నారు. వాస్తవానికి విద్యార్థి సంఘాల నాయకులకు ఇతర సంఘాల నాయకులకు హాస్టల్లో వెళ్ళనీయకపోవడం వల్లనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియకుండా విద్యార్థుల మృతి కారణమయ్యారని అన్నారు. వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.