రెపటి నుంచి బీసీ సంక్షేమ వసతి గృహాల బాట
కరీంనగర్, ఆగస్టు24(విజయక్రాంతి): విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 26 నుండి బీసీ సంక్షేమ వసతి గృహాల బాట కార్యక్రమాన్న బీసీ సంక్షేమ సంఘం చేపట్టనుంది. కరీంనగర్లో 9 బీసీ సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి నగరంలో ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమి ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు సంక్షే మ వసతిగృహాల నిర్మాణానికి కేటాయించడం లేదు నగరంలో 8 పైగా కళాశాల స్థా యి వసతి గృహాలలో ఒక్కో వసతి గృ హంలో 200 మంది విద్యార్థులు వసతి ఉం డగా వీరి అవసరాల నిమిత్తం కేవలం ముగ్గు రు నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం 100 మంది విద్యార్థులకు ము గ్గురు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండాలి ఇలా తక్కువ మంది ఉద్యోగులు ఉండడం వల్ల ప్రభుత్వం ఇటీవల పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా నూతన మెనూను అమ లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతా యి అదనంగా నాలుగో తరగతి ఉద్యోగులను నియమించడం తో పాటు విద్యార్థు లకు సంబంధించిన ఆహార వస్తువుల సప్లై చేసే కాంట్రాక్టర్లు శాంపిల్స్ను ఆయా అధికారుల వద్ద ఉంచి దానికి అనుగుణంగా సప్లై చేయాలి.
కానీ అలా కాకుండా తమ ఇష్టానుసారంగా చేస్తున్నారు దీనివలన నాసిరకం కా లం చెల్లిన సరుకులు వచ్చే ప్రమాదం ఉంది అలాగే నగరంలో నాలుగు కళాశాల స్థాయి బీసీ సంక్షేమ వసతి గృహాలకు పూర్తిస్థాయి సంరక్షణ అధికారులు లేరు దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి వేరే అ ధికారిని ఇన్చార్జ్‌గా నియమిస్తున్నారు
స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం : -కె. శ్రీధర్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ సీ సంక్షేమ సంఘం.
బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. కరీంనగర్లో 9 బీసీ సంక్షేమ వసతిగృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి . పక్కా భవనాలు నిర్మించాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం 100 మంది విద్యార్థులకు ముగ్గురు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండాలి కానీ భర్తీ చేయడం లేదు.
నగరంలో నాలుగు కళాశాల స్థాయి బీసీ సంక్షేమ వసతి గృహాలకు పూర్తిస్థాయి సంరక్షణ అధికారులు లేరు దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి పూర్తిస్థాయి అధికారులను వెంటనే నియమించాలి. ఇలాంటి ప్రధాన డిమాండ్లతో సంక్షేమ బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యల ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిచదిశగా ఉద్యమిస్తాం.






