రెండో రోజు కొనసాగిన అధికారుల నిరసన
26-06-2026 01:20 AM
నస్పూర్, జూన్ 25: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ సీఎంఓఏఐ శ్రీరాంపూర్ అధ్యక్షులు లక్కాకుల మహేష్ నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియా అధికారులు రెండవ రోజైన గురువారం జీఎం కార్యాలయ వేదిక ప్రాంగణంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు దరించి విధులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం వరకు తమ నిరసన కొనసాగుతుందని, అప్పటికే యాజమాన్యం నుంచి స్పం దన లేకపోతే సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29 నుంచి జూలై 13 వరకు రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా జనరల్ సెక్రటరీ మల్లయ్య, జా యింట్ సెక్రటరీ భీమన్న, ట్రెజరర్ పద్మలతో పాటు శ్రీరాంపూర్ ఏరియా అన్ని గనులు, కార్యాలయాల అధికారులు, మహిళా అధికారులు పాల్గొన్నారు.






