25 July, 2026 | 3:08 AM

దెబ్బతిన్న తరగతి గదిని పరిశీలించిన అధికారులు

25-07-2026 01:11 AM

కొండాపూర్, జూలై 24: మండల పరిధిలోని మల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (జెడ్పీహెచ్‌ఎస్) సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 6వ తరగతి గది ఒక వైపు గోడ దెబ్బతిన్నట్లు గుర్తించారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే స్పందించిన అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అవసరమైన సూచనలు చేశారు. రేపటి నుంచి 6వ తరగతి విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల 2వ తరగతి గదికి తాత్కాలికంగా మార్చి బోధన కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రాణ భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దెబ్బతిన్న గదిని సంబంధిత శాఖతో మరమ్మతులు చేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.