4 August, 2026 | 4:38 AM

7న బెంగళూరులో ఓబీసీ మహాసభ

04-08-2026 01:22 AM
  1. ఈ సభను విజయవంతం చేయాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
  3. ‘చలో బెంగళూరు’ ఆడియో విడుదల 

ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఈ నెల 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభ ఏర్పాట్లు 80 శాతం పూర్తయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా వేలాది మంది ఓబీసీ ప్రతినిధు లు మహాసభకు హాజరవుతారని చెప్పారు.

సోమవారం బీసీ సంక్షేమ సంఘం కార్యాల యంలో ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ రచించిన ‘చలో బెంగళూరు‘ ఓబీసీ జాతీయ గీతం ఆడియోను విడుదల చేశారు. ఈ గీ తం బీసీ ఉద్యమానికి సాంస్కృతిక బలంగా నిలుస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొ న్నారు. తెలంగాణ నుంచి సుమారు వెయ్యి మంది, ఏపీ నుంచి 500 మంది, మహారా ష్ట్ర నుంచి వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.

బెంగళూరు మహాసభలో ‘బెంగళూరు డిక్లరేషన్‘ పేరుతో దేశవ్యాప్త బీసీ ఉద్యమ రాజకీయ కార్యాచర ణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రధానమం త్రి నరేంద్ర మోదీని దేశ ప్రధానిగా గౌరవి స్తూనే, బీసీలకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చితే చరిత్రలో గొప్ప సంస్కర్తగా నిలు స్తారని, లేకపోతే బీసీ వ్యతిరేకిగా గుర్తుండిపో తారని రాజకీయ వ్యాఖ్య చేశారు.

ఈ కార్య క్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్  గుజ్జ కృష్ణ, సంఘం తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగం, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, సత్యరాజ్, గూడూరు భాస్కర్, బండి గారి రాజు, ఉదయ్ నేత పాల్గొన్నారు.