18 August, 2026 | 1:46 AM

ఎన్టీఏ ప్రక్షాళన

18-08-2026 12:46 AM
  1. పనితీరు బాగాలేని 50 మంది తొలగింపు
  2. ఏజెన్సీని పునఃవ్యవస్థీకరించేందుకు సమగ్ర చర్యలు
  3. శరవేగంగా ప్రత్యేక విభాగాల్లో నిపుణుల నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౭: పోటీ పరీక్షల విధానంలో సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ప్రక్షాళన చేస్తున్నది. దీనిలో భాగంగా తాజాగా 50 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఎన్టీఏ సిబ్బంది పనితీరుపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు ఏజెన్సీ పరిధిలో పనితీరుపై నివేదికలు అందించారు. ఆ నివేదికల ప్రకారం..

పనితీరు బాగాలేని సిబ్బందిని కేంద్ర విద్యాశాఖ విధుల నుంచి తొలగించింది. అలాగే, ఈ ఏజెన్సీలో కీలక స్థానాల్లో నిపుణుల నియామకం చేపుడుతున్నది. సోమవారం ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ, సీఐఎస్వో, జీఎం టెస్ట్ సెక్యూరిటీ, జీఎం ఆర్ అండ్ డీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పనతోపాటు ఇతర ప్రత్యేక విభాగాల్లో నిపుణుల పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు, గోప్యతా విధానాల్లో సమూల మార్పులు చేసే పనిలో ఎన్టీఏ నిమగ్నమైంది.