18 August, 2026 | 1:51 AM

హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

18-08-2026 12:48 AM
  1. బంగాల్‌లోని తారాపీఠ్‌లో ఘటన
  2. కొనసాగుతున్న సహాయక చర్యలు  

కోల్‌కతా, ఆగస్టు 17:పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్ పట్టణంలో సోమవారం ఉదయం ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం సంభవించి సుమారు ఆరుగురు మృతి చెందగా , పలువురు గాయపడ్డారు. తారాపీఠ్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఒక చెరువు సమీపంలో ఉన్న ’బిదిషిని’ అనే హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ సంఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అగ్నిప్రమాదానికి గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

సంఘటనా స్థలంలో సహాయక, అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని రక్షించి చికిత్స కోసం రాంపూర్‌హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన జరిగిన అనంతరం తారాపీఠ్, రాంపూర్‌హాట్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.