ముసాయిదా ఓటరు జాబితా విడుదల
- అత్యధికంగా శేర్లింగంపల్లి..
- అత్యల్పంగా షాద్ నగర్
- జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా ను జిల్లా ఎన్నికల అధికారి సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు.ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హత కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పులు,
సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16, 2026లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మొత్తం 24,12,652 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,12,381 మంది పురుషులు, 12,00,062 మంది మహిళలు, 209 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే..
48 ఇబ్రహీంపట్నం: 2,59,317
49 ఎల్.బి. నగర్: 3,37,919
50 మహేశ్వరం: 3,39,306
51 రాజేంద్రనగర్: 3,88,278
52 శేరిలింగంపల్లి: 4,43,544
53 చేవెళ్ల: 2,18,274
83 కల్వకుర్తి: 2,16,890
84 షాద్‌నగర్: 2,09,124
జిల్లాలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 4,43,544 మంది ఓటర్లు ఉండగా, ఆ తరువాత రాజేంద్రనగర్లో 3,88,278 మంది, మహేశ్వరంలో 3,39,306 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో..
షాద్‌నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి)షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎన్‌ఆర్ సరిత విడుదల చేశారు.నియోజకవర్గం 2,09124 ఓటర్లు ఉండగా మండలాల వారి గా చుస్తే కొత్తురు మండలం లో 24,503, నందిగామ మండలంలో 24,137, కొందుర్గు మండలం లో 21,931,చౌదరిగూడ మండలం లో 23,162,కేశంపేటమండలం లో 33,436, ఫరూఖ్నగర్ మండలం లో45,233,
షాద్నగర్ మున్సిపాలిటీ లో37,272 ఓటర్లు ఉన్నారు. తహశీల్దార్ కార్యాలయం లో కార్యాలయ వేళల్లో ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఓటరు జాబితా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు చేర్చడం, తొలగింపుపై అభ్యంతరాలు, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైతే సెప్టెంబర్ 16వ తేదీలోగా నిర్ణీత నమూనాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.






