తెలంగాణ విమోచన ఉత్సవ సమితి కన్వీనర్‌గా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
18-08-2026 01:42 AM
షాద్‌నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): తె లంగాణ విమోచన ఉ త్సవ సమితి కన్వీనర్గా బీజేపీ రాష్ట్ర నాయకు డు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ని యమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్ర భుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోస మే విమోచన చరిత్రను, అమరవీరుల త్యా గాలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. విమోచన పోరాట చరిత్రను ప్ర జల్లోకి తీసుకెళ్లేందుకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.






