28 June, 2026 | 2:51 AM

రూ.లక్షల్లో ముంచిన ఎన్నారై పూజారి

28-06-2026 01:42 AM
  1. చేతబడి చేస్తానని బెదిరింపు.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
  2. శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు 

కుత్బుల్లాపూర్, జూన్ 27(విజయక్రాంతి) : పూజల పేరుతో లక్షల రూపాయలు మో సం చేసి, చేతబడి చేస్తానంటూ బాధితులను బెదిరించిన ఎన్నారై పూజారి చామర్తి రామ లచ్చారావును బాచుపల్లి పోలీసు లు అరెస్ట్ చేశారు. అమెరికాకు పారిపోయి న నిందితుడిపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.

అమెరికాలో కూడా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై అక్కడ గుడి యజమాని కేసులు నమోదు చేయడంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు శని వారం అతడిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.