13 March, 2026 | 10:34 PM

నిర్మల్‌లోనే ఆహ్లాద తీరం

13-03-2026 09:10 PM

15న ‘నిర్మల్ వండర్లా’ ప్రారంభం

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణం పరిసర ప్రాంతాలకు అల్లాదం అందించేందుకు ఈనెల 15న నిర్మల్ వండర్లా ప్రారంభిస్తున్న టు నిర్వాకులు ప్రమోద్ చంద్ర రెడ్డి కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ వారు మాట్లాడారు. ఎండ వేడిని తట్టుకోవడానికి, పిల్లలతో కాస్త సమయం గడపడానికి వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడి వాటర్ పార్కులకు వెళ్లడం ఏటా పరిపాటిగా మారింది.

అయితే, మన నిర్మల్ ప్రజలకు ఆ ప్రయాణ భారంతో పాటు ఖర్చును తగ్గించాలనే సంకల్పంతో కొందరు మిత్రులు కలిసి అడుగు వేశారు. మన ఊరిపై ఉన్న ప్రేమను చాటుతూ, నిర్మల్ పట్టణ శివారులో సుమారు ఆరు ఎకరాల భారీ విస్తీర్ణంలో ‘నిర్మల్ వండర్లా’ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మల్ పేరు మారుమోగేలా, అన్ని రకాల అత్యాధునిక హంగులతో, పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ వాటర్ పార్కును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి పొందుపరచాల్సిన అన్ని రకాల అనుమతులు, ధృవీకరణ పత్రాలు ఇప్పటికే తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఈనెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు.