తెలుగుజాతి గర్వించదగ్గ కవిత్రి మొల్ల మాంబ
13-03-2026 08:56 PM
నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి
మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
మణుగూరు, మార్చి 13 (విజయక్రాంతి): తెలుగు జాతి గర్వించదగ్గ కవిత్రి మొల్ల మాంబ అని, నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ బీరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుధాకర్ రెడ్డి హాజరై మొల్ల చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చారన్నారు. ఆనాటి కాలంలో పండితులు రాసే రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా మొళ్ల రామాయణాన్ని రాసిన చరిత్ర కుమ్మర ఆణిముత్యం మొల్లమాంబకే చెందుతుందని కొనియాడారు.




