17 May, 2026 | 12:04 PM

నియోజకవర్గంలో కొత్తగా 11 బస్సులతో ప్రయాణ సౌకర్యం

17-05-2026 10:45 AM

బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో నూతనంగా 11 బస్సులను నడపడానికి అనుమతి పొందడం జరిగిందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. నూతనంగా నేరడిగొండ మీదుగా వడ్డూర్ వెళ్లే బస్సును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరడిగొండ నుండి కుంటాల నేరడగుండా నుంచి వడూరు మీదుగా బోత్ బస్సును ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుమూల గ్రామాల ప్రజలు సమయానుసారంగా బస్సు సౌకర్యం పొందాలని పేర్కొన్నారు