నస్తీపూర్ కొత్త చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ
05-08-2026 10:09 PM
హత్నూర: హత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామ కొత్త చెరువు కట్ట అభివృద్ధి పనులకు బుధవారం సర్పంచ్ ఎల్లకొండ ప్రమీల సాయిలు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ధను ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమీల సాయిలు మాట్లాడుతూ... గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధితో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వ్యవసాయానికి మేలు జరుగడంతో పాటు రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, ధను ఫౌండేషన్ సూపర్‌వైజర్ ప్రశాంత్, ఉప సర్పంచ్ మహేందర్, మహిపాల్ రెడ్డి, మాచునూరి సురేష్, వరిగుంటం శ్రీను, నీరుడు శివాజీ, చిగురు శ్రీశైలం తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






