17 May, 2026 | 12:03 PM

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

17-05-2026 10:48 AM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మర్లపల్లి గ్రామస్తుల కోరిక మేరకు ఆదివారం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. శనివారం గ్రామానికి చెందిన పెద్దలు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. తమ గ్రామం చుట్టూ ఉన్న అనేక గిరిజన గ్రామాల్లో రైతులు జొన్న పంటను పెద్ద మొత్తంలో పండించడం జరిగిందని తెలిపారు. పండించిన పంటను. విక్రయించాలంటే రైతులకు భారంగా మారిందని పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులకు మార్పిడి ఆధ్వర్యంలో కొనుగోలు జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ సహకార సంఘం డైరెక్టర్ చట్ల ఉమేష్ గ్రామ ఉపసర్పంచ్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు