6 April, 2026 | 3:54 AM

జాగృతిలో చేరికలు

06-04-2026 02:24 AM

ముకరంపుర, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): తెలంగాణ జాగృతిలో ఆదివారం పలువురు చేరారు. వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు వేసి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో ఈ నెల 25న నూ తన రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తున్న సందర్భంగా జిల్లాలో జాగృతిలోకి విస్తృతంగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా యువతకు మ హిళలకు కవితక్క నాయకత్వం పట్ల పూర్తి నమ్మకంతో జాగృతిలో చేరుతున్నారని, జా గృతిలో చేరిన వారందరికీ సముచిత గౌ రవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరు పతి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడు శ్రీనివాస్, నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జంగా అపర్ణ, పుల్లూరి అంజలి, తదితరులు పాల్గొన్నారు.