దిగొచ్చిన బంగారం, వెండి
11-06-2026 02:40 AM
10 గ్రాముల పసిడిపై రూ.4,300, వెండి రూ.10 వేలు తగ్గుదల
న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.4,300 క్షీణించి, రూ.1.56లక్షలకు(పన్నులన్నీ కలిపి) పతనమైంది. కిలో వెండి సైతం రూ.10వేలు తగ్గి, రూ.2.45లక్షలకు( పన్నులన్నీ కలిపి) చేరింది. క్రూడాయిల్ రేట్లు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడంతో డిమాండ్ తగ్గుముఖం పట్టడం వల్ల ఈ లోహాల ధరలు పడిపోయా యి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు పసిడి ధర రోజు వ్యవధిలో 90 డాలర్లు పతనమై 4,168 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు ధర 2.24 శాతం క్షీణించి, 63.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది.






