6 April, 2026 | 4:26 AM

వేములవాడ రాజన్నాలయ ఇంచార్జి ఈఓ గా అంజనా రెడ్డి బాధ్యతలు స్వీకారం

06-04-2026 02:28 AM

వేములవాడ, ఏప్రిల్ 5,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కు ఇంచార్జి ఈఓ గా అంజనా రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఆలయ ఈఓ రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈఓ గా ఉన్న అంజనా రెడ్డి ని ఇంచార్జి ఈఓ గా ని యమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇన్చార్జ్ ఈవోగా బా ధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు,

వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. తరువాత ఆలయ సహాయ కార్యనిర్వ హణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ శేషవ స్త్రం, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.అనంతరం ఈఓ చాంబర్లో అంజనా రెడ్డి ఇంచార్జి ఈఓ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆల య ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.