11 June, 2026 | 3:46 AM

మోదీ పాలనపై ప్రత్యేక తీర్మానం

11-06-2026 02:46 AM

ఎన్డీఏ సమావేశంలో ప్రతిపాదించిన ఏపీ సీఎం చంద్రబాబు

భారత ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని పదవిలో కొనసాగుతూ.. 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధా నిని ఎన్డీయే కూటమి నేతలు ఘనంగా సత్కరించారు. ఢిల్లీలో బుధవారం ఘనంగా వేడుకలు చేసుకున్నారు.

మోదీ 12 ఏళ్ల పాలనపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏపీ సీఎం చం ద్రబాబు ప్రతిపాదించగా, నాగాలాండ్ ముఖ్యమంత్రి, ఎన్పీఎఫ్ నేత నెయిఫియు రియో బలపరిచారు. ఈ వేడుకల సందర్భం గా దేశ రాజధానిలో ఎన్డీయే కీలక సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి ప్ర ధాని మోదీతో పాటు బీజేపీ అగ్ర నాయకత్వం హాజరైంది. కూటమిలోని అన్ని భాగ స్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. ఎన్డీయే పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ భేటీకి వచ్చారు.

జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశం లో సమీక్షించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా మార్చాలనే మోదీ సంకల్పంపై ప్రధానంగా చర్చించారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. మోదీ నాయకత్వ పటిమను, ఆయన సాధించిన చారిత్రాత్మక విజ యాలను చంద్రబాబు కొనియాడారు. దేశా నాగాలాండ్ సీఎం, ఎన్పీఎఫ్ నేత నెయిఫియురియో ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పథకాలను, సమగ్రవృద్ధిని ఆయన ప్రశంసించారు. మోదీ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, కీలక విధాన నిర్ణయాలపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఎన్డీయే భవిష్యత్తు కార్యా చరణను ఖరారుచేశారు. మోదీ ప్రభుత్వంపై పీఎంఓ హర్షం వ్యక్తం చేసింది. వేడుకల అనంతరం మోదీ, ఎన్డీయే నేతలు గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, జేడీయూ నాయకుడు సంజయ్‌ఝా, శివసేన నేత ఏకనాథ్ షిండే, ఎల్జేపీ(ఆర్) నేత చిరాగ్‌పాశ్వాన్, ఎన్సీపీ నాయకురాలు సునేత్రాపవార్, జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. హెచ్‌డీ కుమారస్వామి, జయంత్‌చౌదరి, జితన్‌రామ్ మాంఝీ తదితరులు హాజరయ్యారు.