ప్రధాని మోదీకి అభినందనల వెల్లువ
- 12 ఏళ్ల విజయాలను కొనియాడుతూ క్యాబినెట్ తీర్మానం
- తొలి ప్రధాని నెహ్రూ రికార్డు బద్ధలు
- ఏకధాటిగా 4,399 రోజుల పాటు సేవలు
- అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2(ఎ)కు ఆమోదం
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధానమంత్రిగా మోదీ వరుసగా 4,398 రోజుల పాటు సేవ లు అందించిన ఘనతను సొంతం చేసుకున్నందుకు గాను కేంద్ర క్యాబినెట్ ఆయన్ను అభినందించింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం దీనిపై చర్చించి ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.
గతంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల నిరంతర సేవ రికార్డును మోదీ అధిగమించిన సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. పేదలే కేంద్ర బిందు వుగా, వారికి పక్కా ఇళ్లు, విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు అందించినట్లు వివరించింది.
డీబీ టీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత వైద్య సౌకర్యం, పేదరికం నుంచి బయటపడ్డ 25 కోట్ల మంది, ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్ట ప్ వ్యవస్థగా భారత్ ఎదగడం, చంద్రయాన్, మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని తీర్మానంలో పేర్కొన్నారు.
లక్పతీ దీదీ, అంతరి క్షంలో మహిళలు, పొగ రహిత వంటశాలలు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లు కు ఆమోదం, కిసాన్ సమ్మాన్ నిధి, పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు లు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల వల్ల రక్షణ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా దేశీయ ఉత్పా దక సామర్థ్యం పెరిగిందని స్పష్టం చేసింది. కాగా ఈ సమావేశంలో అహ్మదాబాద్ మె ట్రోరైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2(ఎ)కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రధానికి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వం దేశ ప్రజల అచంచలమైన నమ్మకానికి నిదర్శనమన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అట్టుడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందేలా చేసిన నాయకత్వం మోదీ సొంతమని, ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన పథకాలతో తన హృ దయంలో ప్రత్యేక స్థానం ఉందని అధ్యక్షురాలు ముర్మూ హర్షం వ్యక్తం చేశారు.
కాగా ప్రధాని మోదీ అత్యధిక వరుస పాలన రికా ర్డు పట్ల పలువురు విదేశీ ప్రతినిధులు కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. భారత మండపంలో జరిగిన సమావేశానికి బీజేపీ ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ప్రధానికి అభినందనలు తెలిపారు.
విందు.. పసందు
ఎన్డీయే సమావేశంలో దేశీయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అందించిన బంగాల్ సంప్రదాయ వంకటం ‘ఝూల్‌మరీ’ని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఇష్టంగా ఆరగించారు. అనంతరం ప్రధాని స్వయంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ వంటకాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే చిరుధాన్యాల వంటి సంప్రదాయ వంటకాలను నేతలకు వడ్డించారు.






