6 April, 2026 | 3:57 AM

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి

06-04-2026 02:22 AM

నివాళులర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్నగర్, ఏప్రిల్ 5(విజయక్రాంతి): భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు షాద్నగర్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేత జాంగారి రవి ఆధ్వర్యంలో స్థానిక బ్లాక్ ఆఫీస్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగ్జీవన్ రామ్ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 40 ఏళ్లు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారు. దళిత, బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు ఆయన కొనియాడారు.

‘దళితులలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన గొప్ప నేత జగ్జీవన్ రామ్. సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఆయన చూపిన బాట అందరికీ ఆదర్శనీయం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, వివిధ పార్టీల నేతలు రఘు నాయక్, కృష్ణ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, గంధం ఆనంద్, దళిత సంఘాలనేతలు పాల్గొన్నారు.

మేడ్చల్ అర్బన్..

మేడ్చల్ అర్బన్, ఎప్రిల్ 5 (విజయక్రాంతి): భారత దేశ తొలి ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్118 వ జయంతి వేడుకలు మేడ్చల్,గుండ్లపోచంపల్లి  పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు. గుండ్ల పోచంపల్లి ట్యాంక్ బాండ్ పై నెలకొన్నా డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహానికి గుండ్లపోచంపల్లి 299 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని ఎస్సీ బస్తీ సమీపంలోని డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహానికి మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బేరి ఈశ్వర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమాల్లో మేడ్చల్ కిష్టాపూర్ డివిజన్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పానుగంటి మహేష్ కుమార్.ముఖ్య అతిథిగా సిఏ నవీన్ రెడ్డి.మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఉదండపురం సత్యనారాయణ, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి. నరేందర్ ముదిరాజ్. గరిసెల సురేందర్ ముదిరాజ్. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్.

మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివశంకర్ ముదిరాజ్.సిహెచ్ రమేష్. మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహ రెడ్డి. రామన్నగారి రాఘవేందర్ గౌడ్. ఆర్ సంతోష్ గౌడ్. మాజీ కౌన్సిలర్ లు కౌడే మహేష్ కురుమ. నడికొప్పు చాప రాజు నాయకులు చంద్రయ్య గౌడ్. దుర్గం వెంకటేష్ ముదిరాజ్. వేముల రంజిత్ రెడ్డి. పత్తి శంకర్ లతో పాటు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లు భేరి బాలరాజు.

దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్. జనార్దన్ రెడ్డి. ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి. గడీల మధుసూదన్ రెడ్డి. మాజీ ఉప సర్పంచ్ బట్టి దేవేందర్ ముదిరాజ్. గువ్వ రవి ముదిరాజ్. కావేరి శేఖర్. ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్. మలిగే అశోక్. నవీన్. వెంకట్. ఉదయ్ గౌడ్ పాల్గొన్నారు.

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

శంకర్ పల్లి, ఏప్రిల్ 5, (విజయ క్రాంతి) : మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని శంకర్పల్లి మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 99 వ జయంతి సందర్భంగా శంకర్ పల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్ వసంత మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, ఉపాధ్యాయులు రాములు, బాలరాజ్  పాల్గొన్నారు.

ఘట్ కేసర్..

ఘట్ కేసర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : దేశ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆదివారం ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఘట్ కేసర్ పట్టణంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మెన్ లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ఆధ్యక్షులు మామిళ్ల ముత్యాల్ యాదవ్  ముఖ్యఅతిథులుగా విచ్చేసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈవేడుకలో మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్ పిఎస్ రాష్ట్ర వర్కిoగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మీసాల మల్లేష్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షులు సురేష్ నాయక్,

కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ సగ్గు అనీత శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, నాయకులు మేకల దాసు, మేకల నర్సింగ్ రావు, ఇరిటపు శ్రీనివాస్, బొక్క ప్రభాకర్ రెడ్డి, వి.బి. వెంకటనారాయణ, రేసు లక్ష్మారెడ్డి, బర్ల దేవేందర్ ముదిరాజ్, నవీన్ ప్రకాష్, ఖయ్యూం, మంకయ్య, డొంకెన్ని శంకర్ గౌడ్, కె.ఎం. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.