1 June, 2026 | 4:17 AM

3 నెలల పసికందుకు ప్రాణం పోసిన నియోనేటల్ అంబులెన్స్ సిబ్బంది

01-06-2026 12:36 AM

నల్లగొండ టౌన్, మే 31: మూడు నెలల పసి కందుకు 108 సిబ్బంది ప్రాణం పో శారు. నిడమనూరు మం డలం తుమ్మడం గ్రామానికి చెందిన శ్రీ వర్షి ణి ఆరోగ్య పరిస్థితి పరిస్థితిపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లేమని సిబ్బంది అదివారం తెలిపారు. అంబు బ్యాగ్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ వెంటిలేటర్ సహాయంతో వైటల్స్ మానిటర్ చేస్తూ శిశువును వెంటిలేటర్ సపోర్ట్ పీఎస్వి - టీవీ మోడ్ ద్వారా వెంటిలేటర్ తో ఆక్సిజన్ అందించామని సిబ్బంది తెలిపారు. అలాగే ఈ ఆర్ సి డాక్టర్ సపోర్ట్ తీసుకొని సిరంజి పంప్ సహాయంతో అడ్రినలిన్ డ్రగ్ ఇచ్చాము అని మార్గ మధ్యలో జాగ్రత్తగా వైటల్స్ నార్మల్ చేస్తూ మానిటర్ ద్వారా సురక్షితంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.