3 August, 2026 | 1:13 AM

నాగోల్‌లో ‘నేను సైతం 2.0’

03-08-2026 12:00 AM
  1. 78 సీసీటీవీల ప్రారంభం
  2. సైబర్ నేరాలపై అప్రమత్తత..
  3. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన

నాగోల్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమమైన ’నేను సైతం 2.0’లో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహభావన అపార్ట్మెంట్స్ సి-బ్లాక్లో ఏర్పాటు చేసిన 78 సీసీటీవీ కెమెరాలను ఆదివారం నాగోల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐ సూర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ నివాసితులతో పోలీసులు సమావేశమై సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

అలాగే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపులో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల సహకారంతో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహభావన అపార్ట్మెంట్స్ అధ్యక్షుడు చి. శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షురాలు బి. సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి అబిద్ హుస్సేన్, సలహాదారు జి. అంజనేయులు, అపార్ట్మెంట్ నివాసితులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.