3 August, 2026 | 2:17 AM

సీఎం రేవంత్‌కు స్వాగతం పలికిన నీలిమ

03-08-2026 01:13 AM

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

సికింద్రాబాద్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందు కు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బందితో కలిసి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఘ నంగా స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో ముఖ్యమం త్రిని ఆలయంలోకి ఆహ్వానించారు.

ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం డాక్టర్ కోట నీలిమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ ప్రధాన పూజారులతో కలిసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు కోట నీలిమ ముఖ్యమంత్రికి ఆలయ విశిష్టత, బోనాల మహోత్సవాల వైభవం, భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ బోనాల మహోత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.