15 May, 2026 | 12:32 PM

NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు

15-05-2026 11:10 AM

NEET 2026 మళ్లీ ఎప్పుడు జరుగుతుంది?
 NEET UG 2026 పునఃపరీక్షను జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

న్యూఢిల్లీ: పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయబడిన వైద్య ప్రవేశ పరీక్ష NEET-UG 2026(Re NEET 2026 exam date), జూన్ 21న తిరిగి నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్ష ఇంతకుముందు మే 3న నిర్వహించబడింది. NEET-UG పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA మంగళవారం ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి ఆరోపించబడుతున్న అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) సమగ్ర విచారణ చేపడుతుందని తెలిపింది.

ఇలాంటి విద్యా వార్తలు కోసం మా ఎడ్యుకేషన్ విభాగాన్ని సందర్శించండి.

పరీక్ష తేదీకి సంబంధించి X వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో NTA ఇలా పేర్కొంది. NEET (UG) 2026 ప్రకటన. భారత ప్రభుత్వ ఆమోదంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET (UG) 2026 పునఃపరీక్షను ఆదివారం జూన్ 21, 2026న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచార మార్గాలపై మాత్రమే ఆధారపడాలని కూడా ఈ ఏజెన్సీ సూచించింది. పునఃపరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా  విశ్వసనీయంగా నిర్వహించే విధానాలపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Education Minister Dharmendra Pradhan) సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

2026, మే 3న, ఇరవై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (అండర్ గ్రాడ్యుయేట్)కు హాజరయ్యారు. తొమ్మిది రోజుల తర్వాత, ఆ పరీక్షను రద్దు చేశారు. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు అధికారులు చేతితో రాసిన ఒక గెస్ పేపర్(NEET UG paper leak) ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో కాపీని రూ. 5 లక్షలకు అమ్మినట్లు సమాచారం. అందులోని బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ దాదాపుగా అసలు నీట్ పేపర్‌తో సరిపోలాయి. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను రంగంలోకి దించారు. గత పక్షం రోజులుగా పూర్తి భద్రతా ప్రోటోకాల్ పాటించామని విద్యార్థులకు హామీ ఇస్తూ వచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఇప్పుడు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని వాగ్దానం చేసింది. పరీక్ష తేదీ వెల్లడించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నార.

ఇవి కూడా చదవండి:

NEET-UG 2026 cancelled: కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

విద్యార్థులకు భారీ షాక్: ప్రశ్నాపత్రం లీక్— దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు