15 May, 2026 | 1:19 PM

ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష

15-05-2026 12:08 PM
  1. వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్లో నీట్ పరీక్ష
  2. సీబీటీ విధానంలో నీట్
  3. నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  4. పరీక్ష సెంటర్ నిర్ణయించుకునేందుకు వారం గడువు.
  5. జూన్ 21 నీట్ రీ- ఎగ్జామ్.
  6. 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష(NEET Exam Online) నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) ప్రకటించారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామని వివరించారు. మళ్లీ మాల్ ప్రాస్టీస్ జరగకుండా చూడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. జూన్ 21 నుంచి నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని సూచించారు.

నీట్ కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నీట్ కోసం మళ్లీ ఫీజు(NEET Exam Fee) చెల్లించాల్సిన అవసరం లేదని ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) వెల్లడించారు. ఏ నగరాల్లో పరీక్ష రాయాలో నిర్ణయించుకునేందుకు విద్యార్థులకు వారం గడువు ఇస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తే మత మొదటి ప్రాధాన్యమని తెలిపారు.

NEET-UG పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్

అభ్యర్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్(NEET UG Re-Exam 2026) తేదీని ప్రకటించింది. పేపర్ లీక్‌తో మే 3న జరిగిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. అభ్యర్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి, రాజకీయ నేతలు ఆందోళనల మేరకు రీ షెడ్యూల్ చేసింది. అటు నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్ అయినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.