రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకుండానే విద్యా కమిషన్
కొత్తపల్లి, మార్చి 1(విజయక్రాంతి):శాతవాహన యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం యూ నివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో గడచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్రానికి విద్యాశాఖ మం త్రి నియమించకుండా విద్యావ్యవస్థను నిర్వీ ర్యం చేసి ఇప్పుడు వేసిన విద్య కమిషన్ లో అసలు
సంబంధమే లేని అధికారులకు వేరే రంగాలకు చెందిన వారిని విద్యా కమిషన్ లో నియమించడం అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద రాష్ట్రంలోని విద్యార్థుల మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తుందని,లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా క మిషన్లో విద్యావేత్తలు, అనుభవం ఉన్న టీ చర్లు, పిల్లల మనస్తత్వం తెలిసిన చైల్ సైకాలజిస్టులు, సబ్జెక్ట్ నిపుణులు లేకుండానే రా ష్ట్రానికి ఏకంగా ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయొచ్చనే గొప్ప ఆ లోచన,
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నా రు. కొత్త విద్యా వి ధానం విషయంలో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచ ర్లు పారదర్శకత కోరుకుంటున్నారని, విద్యాశాఖ కమిషన్ రా ష్ట్రంలో ఎక్కడెక్కడ మేధా వులు అభిప్రాయా లు విద్యావేత్తల అభిప్రాయాలు విద్యార్థి సం ఘాల అభిప్రాయాలు తల్లిదండ్రుల అభిప్రాయాలు ఏ పాఠశాలలో ఏ యూనివర్సిటీలో ఎక్కడెక్కడ ఎవరెవరి అభిప్రాయాలు తీసుకుని ఆ నివేదికను రూ పొందించారు.
విద్యాశాఖ మీద కనీసం అవగాహన లేని వ్యక్తులు ఒక నివేదిక రూపొందించడం పట్ల రాష్ట్రంలోని విద్యార్థి సంఘా లు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు భార తదేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా శాఖ మంత్రి లేకుండా విద్య కమిషన్ వేయడం ఆ కమిషన్ నివేదిక రూపొందించడం లోపాల పుట్టగా ఉన్న విద్యాశాఖ ఇచ్చిన కమిషన్ నివేదిక సిఫారసులను అమలు చేస్తామంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని చుక్క శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్వి నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ , ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్ , శివ , దేవుని ఆంజనేయులు , విక్రమ్ లు పాల్గొన్నారు.




